Share News

వస్తు నాణ్యతపై అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:32 AM

వస్తు నాణ్యతపె వినియోగదారుల అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కోరారు.

వస్తు నాణ్యతపై అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

బెలగాం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): వస్తు నాణ్యతపె వినియోగదారుల అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కోరారు. శని వారం గిరిమిత్ర భవనంలో మహిళా సాధికారత లక్ష్యంగా నిర్వహించిన షైన్‌ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ని త్యావసర వస్తులు కొనుగోలు చేసేటప్పుడు కేవలం ధర అందుబాటును మాత్రమే కాకుండా వాటి నాణ్యత, బ్రాండ్‌, ప్రమాణాలను పరిశీలిం చాలని సూచించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు సమా జంలో వినియోగదారుల హక్కుల కోసం మహిళల్లో చైతన్యం పెంచు తాయన్నారు. వసు నాణ్యత గుర్తింపు వంటి అంశాలు మహిళలు, ప్రజా సంఘాలు చైతన్య వంతులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, పి.లావణ్య దీప్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 12:32 AM