Share News

ఆలయాల స్వయం ప్రతిపత్తిపై అవగాహన

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:15 AM

పట్టణంలో ఆదివారం దేవాలయాల స్వయం ప్రతిపత్తిపై విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు చింత భాస్కర్‌నాయుడు, జిల్లా కార్యదర్శి కె.రామకృష్ణ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఆలయాల స్వయం ప్రతిపత్తిపై అవగాహన
అవగాహన కల్పిస్తున్న వక్త

పాలకొండ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఆదివారం దేవాలయాల స్వయం ప్రతిపత్తిపై విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు చింత భాస్కర్‌నాయుడు, జిల్లా కార్యదర్శి కె.రామకృష్ణ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యవక్తగా విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 ఏళ్లు పూర్తయినా హిందువులకు దేవాల యాలను నిర్వహించుకునే స్వతంత్రత నేటికీ రాలేదన్నారు. దేవాల యాల స్వయం ప్రతిపత్తి కోసం దేవదాయ ధర్మదాయ చట్టం స్థానంలో ఒక నమూనా డ్రాఫ్ట్‌ తయారు చేశామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ్‌ సాయిరాం నూతన ముసాయిదా చట్టాన్ని వివరించారు. కార్యక్రమంలో ముసాయిదా కరదీపికలను పంపిణీ చేశారు.

Updated Date - Mar 23 , 2026 | 12:15 AM