సహాయక చర్యలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:06 AM
ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరికి ప్రాథమిక సహాయక చర్యలపై అవగాహన అవసరమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
పార్వతీపురం రూరల్, ఫిబ్రవరి4 (ఆంధ్రజ్యోతి): ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరికి ప్రాథమిక సహాయక చర్యలపై అవగాహన అవసరమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎంఆర్‌నగర్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, రెడ్‌క్రాస్ సంస్థ సంయుక్తం ఆధ్వర్యంలో నిర్వహించిన రెస్క్యూ, ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ ప్రదర్శనను ఆయన ముఖ్యఅతిఽథి హాజరై ప్రారంభించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా రక్షించాలని అనే అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి పి.సింహాచలం, కళాశాల ప్రినిపాల్ ఉదయ్‌కుమార్ తదితరులున్నారు.