Agriculture ఆధునిక వ్యవసాయంపై అవగాహన అవసరం
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:32 AM
Awareness of Modern Agriculture is Essential గిరిజన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో క్షేత్రస్థాయి పర్యటనకు 40మంది గిరిజన రైతులతో స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి బయలుదేరిన బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
పసుపు సాగు పరిశీలన కోసంకోయంబత్తూరు పయనమైన గిరిజన రైతులు
సీతంపేట,సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో క్షేత్రస్థాయి పర్యటనకు 40మంది గిరిజన రైతులతో స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి బయలుదేరిన బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతు.. కోయంబత్తూరులో పసుపు సాగులో అక్కడ రైతులు అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక పద్దతులు, పంట యాజమాన్య విధానాలు, అధిక దిగుబడుల సాధనకు చేస్తున్న కృషిని తెలుసుకోవాలన్నారు. సాగులో తీసుకుంటున్న జాగ్రత్తలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయి సందర్శన ద్వారా రైతులకు ఆధునిక సాగు విధానాలపై మరింత అవగాహన వస్తుందన్నారు. తద్వారా పంట దిగుబడితో పాటు రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనకు సీతంపేట, భామిని, కొత్తూరు, సారవకోట, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాలకు చెందిన గిరిజన రైతులు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌వో ఎస్‌వీ గణేష్, ఏవో సునీల్, హార్టికల్చర్ సిబ్బంది పాల్గొన్నారు.