Awareness నేరాల నియంత్రణకు ప్రచారం
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:30 AM
Awareness Campaign to Curb Crime నేరాల నియంత్రణలో భాగంగా శుక్రవారం చినమేరంగి సర్కిల్ కార్యాలయంలో ఆటోల ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పాలకొండ డీఎస్పీ రాంబాబు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జియ్యమ్మవలస, జనవరి9(ఆంధ్రజ్యోతి):నేరాల నియంత్రణలో భాగంగా శుక్రవారం చినమేరంగి సర్కిల్ కార్యాలయంలో ఆటోల ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పాలకొండ డీఎస్పీ రాంబాబు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంక్రాంతి పండుగ నేప థ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్‌లు పెరుగుతున్నందున మహిళలు జాగ్రత్తలు పాటించాలన్నారు. పండుగకు ఊర్లు వెళ్లేవారు.. పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇళ్లు, దేవాలయాల వద్ద బంగారం, నగదు ఉంచరాదన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల బైకులు ఎక్కరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు, ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్, పోలీస్‌స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.