యువత వ్యసనాలకు దూరంగా ఉండండి: ఎస్పీ
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:59 PM
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని... వాటికి బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు.
విజయనగరం క్రైం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని... వాటికి బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. శనివారం గురజాడ కళా క్షేత్రంలో యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి యువతే వెన్నె ముకని... దేశాన్ని అన్ని రంగాల్లో ముందుండి నడిపి స్తున్నారని వివేకానందుడు బలంగా విశ్వసించే వార న్నారు. వివేకానందుని ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లాలని సూచించారు. ఇటీవల యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకులోనై భవిష్యత్తుని నాశ నం చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. గంజా యి కేసుల్లో అరెస్టయిన వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఉపకమిషనర్ మణికుమార్, ఏటీకే వ్యవస్థాప కులు ఎండీ కరీముల్లా షరీఫ్, సాహితీవేత్త సురేష్, సీఐలు ఆర్‌వీఆర్‌కే చౌదరి, సూరినాయుడు, రాము తది తరులు పాల్గొన్నారు.