‘తప్పుడు ప్రచారాలు మానుకోండి’
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:06 AM
కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, అరుకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు ఎం.తేజోవతి హితవు పలికారు.
గరుగుబిల్లి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, అరుకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు ఎం.తేజోవతి హితవు పలికారు. సోమవారం మరుపెంటలో ఎంపీపీ ఉరిటి రామారావు నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తే దానిపై వైసీపీ తప్పుడు ప్రచారాలు చేయడం తగదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను పూర్తిస్థాయిలో కల్పించేందుకు మంత్రి లోకేశ్ ఇతర దేశాల్లో పర్యటిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్వాకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సరిచేస్తున్నారన్నారు. పథకాల అమలుతో దేశంలో ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉరిటి నిర్మల, కె.తిరుపతిరావు, ఎం.సింహాచలంనాయుడు, బి.సురేష్ పాల్గొన్నారు.