Share News

Avoid Any Mistakes పొరపాట్లుకు తావివ్వొద్దు

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:10 AM

Avoid Any Mistakes ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లుకు తావివ్వొద్దని, పూర్తి పారదర్శకతతో పనిచేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మన్యం కళావేదికలో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు.

Avoid Any Mistakes  పొరపాట్లుకు తావివ్వొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

బెలగాం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లుకు తావివ్వొద్దని, పూర్తి పారదర్శకతతో పనిచేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మన్యం కళావేదికలో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఎన్నికల నియామవళికి అనుగుణంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులంతా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పత్రాల పరిశీలన, అప్పీళ్లు, నామినేషన్‌ ఉపసంహరణ వంటి కీలక దశలను నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ మాత్రమే ఫోన్‌ కలిగి ఉండాలని తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. గుర్తింపు కార్డును పరిశీలించిన తర్వాత పోలింగ్‌ కేంద్రం లోపలకు అనుమతించాలన్నారు. పీవో హ్యాండ్‌బుక్‌లో ఉన్న ప్రతి పేజీని చదివి ఏ కార్యకలాపాన్ని ఎలా చేయాలో తెలుసుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. సీసీ టీవీ, నిఘా వ్యవస్థ, పోలీస్‌ బందోబస్తును పరిశీలించిన అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోడౌన్‌లో తగినంత గాలి, వెలుతురు ఉండేలా చూడాలని, తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అగ్నిమాపక పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఆయన వెంట డీఆర్వో కె.హేమలత, పార్వతీపురం మున్సిపల్‌ కమిషనర్‌ బి.రామ్‌గోపాల్‌ తదితరులు ఉల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:10 AM