ఆటో బోల్తా.. యువకుడి మృతి
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:03 AM
పట్టణంలోని చీపురుపల్లి రోడ్డులో ఆదివారం ఆటో బోల్తాపడిన ఘటనలో పట్టణంలోని మాదిగ వీధికి చెందిన పెంట ఆనంద్(23) అనే యువకుడు మృతిచెందాడు.
రాజాం రూరల్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని చీపురుపల్లి రోడ్డులో ఆదివారం ఆటో బోల్తాపడిన ఘటనలో పట్టణంలోని మాదిగ వీధికి చెందిన పెంట ఆనంద్(23) అనే యువకుడు మృతిచెందాడు. దీపావళి సందర్భంగా చీపు రుపల్లి రోడ్డులో ఏర్పాటుచేసిన బాణసంచా షాపుల వద్దకు స్నేహితులు ముంజే టి వినోద్‌కుమార్, యందవ ఆకాశ్‌లతో కలిసి ఆటోలో వెళ్లాడు. బాణసంచా కొనుగోలుచేసి తిరిగి వస్తుండగా ఆవును తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఆకాశ్ పక్కన కూర్చున్న ఆనంద్ డివైడర్‌పై పడిపో వడంతో తీవ్ర గాయాలయ్యాయి. రాజాం ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం జీఎంఆర్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అయి తే అప్పటికే ఆనంద్ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతుడి తల్లి పెంట అసిరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మహమ్మద్ సల్మాన్‌బేగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.