Share News

ద్విచక్ర వాహనం ఢీకొని ఆటో బోల్తా

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:13 AM

నిర్లక్ష్యంగా, అతివేగంగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనం ఢీకొని ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతిచెందింది.

ద్విచక్ర వాహనం ఢీకొని ఆటో బోల్తా

  • మహిళ మృతి

గుర్ల, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యంగా, అతివేగంగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనం ఢీకొని ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. చుక్క పేట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబం ధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం నుంచి చీపు రుపల్లి వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా అతివేగంతో వస్తున్న ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో లో ప్రయాణిస్తున్న విజయనగరం పల్లివీధికి చెందిన సామేను సామాలమ్మ(63) తలకు తీవ్ర గాయమైంది. మిగతా వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్థానికులు వెంటనే 108 ద్వారా విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్‌ఐ నారాయణరావు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్‌ చేశారు.

Updated Date - Oct 07 , 2026 | 12:13 AM