Share News

ఆటోమొబైల్‌ షాప్‌ దగ్ధం

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:06 AM

రాజాం పట్టణంలో ఆదివారం రాత్రి జరిగి అగ్నిప్రమాదంలో ఓ ఆటోమొబైల్‌ షాప్‌ దగ్ధమయ్యింది.

ఆటోమొబైల్‌ షాప్‌ దగ్ధం

  • రూ.25 లక్షల ఆస్తినష్టం

రాజాం రూరల్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాజాం పట్టణంలో ఆదివారం రాత్రి జరిగి అగ్నిప్రమాదంలో ఓ ఆటోమొబైల్‌ షాప్‌ దగ్ధమయ్యింది. సుమారు రూ.25 లక్షలు ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథ మికంగా అంచనా వేశారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన శివకుమార్‌ గత 20 ఏళ్లుగా పట్టణంలోని పాలకొండ రోడ్డులో ఆటోమొబైల్‌ విడిభాగాలు, లూబ్రికెంట్‌ షాప్‌ను నిర్వహిస్తున్నారు. ఆదివారం దీపావళి కావడంతో షాపు తెరవలేదు. అయితే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో షాప్‌ నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు రావడంతో స్థానికులు షాప్‌ యజమానికి ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన అందించిన సమాచారం మేరక ఫైర్‌ ఆఫీసర్‌ అశోక్‌ ఆధ్వ ర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకు వచ్చారు. ట్రాక్టర్‌ విడిభాగాలు, ఆయిల్స్‌, ఇతరత్రా పరికరాలు ఉండడంతో ప్రమా దతీవ్రత ఎక్కువైందని ఫైర్‌సిబ్బంది చెబుతున్నారు. షాప్‌ సమీపంలో నివశిస్తున్న కుటుం బీకులు బాణసంచా కాల్చడంతోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్‌ సిబ్బంది భావిస్తున్నారు. ప్రమాదంలో క్యాష్‌ కౌంటర్‌లోని నగదు కూడా దగ్ధమైందని షాప్‌ యజమాని శివకుమార్‌ తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 12:06 AM