Share News

ఆటో, ద్విచక్రవాహనం ఢీ

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:10 AM

మండలంలోని సవరవల్లి సమీప సర్వీస్‌ రోడ్డులో ఆదివారం ద్విచక్ర వాహ నం, ఆటో ఢీకొన్న ప్రమాదంలో పూసపాటిరేగ మండలం చౌడమ్మ అగ్రహారానికి చెందిన అదపాక చిట్టెమ్మ(43) అక్కడి కక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యా యి.

ఆటో, ద్విచక్రవాహనం ఢీ

  • ఒకరి మృతి

  • నలుగురికి గాయాలు

భోగాపురం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని సవరవల్లి సమీప సర్వీస్‌ రోడ్డులో ఆదివారం ద్విచక్ర వాహ నం, ఆటో ఢీకొన్న ప్రమాదంలో పూసపాటిరేగ మండలం చౌడమ్మ అగ్రహారానికి చెందిన అదపాక చిట్టెమ్మ(43) అక్కడి కక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యా యి. వివరాలిలా ఉన్నాయి. చేపలకంచేరు గ్రామానికి చెందిన మైలపల్లి అప్పన్న, మైలపల్లి అభి, దాసరి హరి అనే ముగ్గురు గత కొంతకాలంగా విశాఖలో నివాసం ఉంటున్నారు. వీరు ఆదివారం ఓ శుభకా ర్యం నిమిత్తం చేపలకంచేరు వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై విశాఖ నుంచి బయ లుదేరారు. వీరు సవరవల్లి సమీప సర్వీస్‌ రోడ్డులో వెళ్తుండగా, అదే రహదారిలో ఎదురుగా ఆటో వస్తోంది. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ముందు కూర్చున్న అదపాక చిట్టెమ్మ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించగా, క్షతగాత్రులను తగరపువలస ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 07 , 2026 | 12:10 AM