ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆటో
ABN , Publish Date - May 29 , 2026 | 12:23 AM
చీపురుపల్లి, గరివిడి పట్టణాల మధ్య గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయరాంపురం గ్రామానికి చెందిన రేగిడి రామూర్తి(55) అనే వ్యక్తి మృతిచెందాడు.
ఒకరి మృతి
చీపురుపల్లి, మే 28(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి, గరివిడి పట్టణాల మధ్య గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయరాంపురం గ్రామానికి చెందిన రేగిడి రామూర్తి(55) అనే వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని విజయరాంపు రం గ్రామానికి చెందిన రామ్మూర్తి ద్విచక్ర వాహనంపై గరివిడి నుంచి చీపురు పల్లి వస్తుండగా, గరివిడి వైపు వెళ్తున్న ఆటో రామూర్తిని బలంగా ఢీకొంది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో రామూర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.