Share News

లారీని ఢీకొట్టిన ఆటో.. ఒకరి మృతి

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:48 AM

పోలిపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శీల రాంబాబు(37) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్టు సీఐ కె.దుర్గాప్రసాదురావు తెలిపారు.

 లారీని ఢీకొట్టిన ఆటో.. ఒకరి మృతి

భోగాపురం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): పోలిపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శీల రాంబాబు(37) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్టు సీఐ కె.దుర్గాప్రసాదురావు తెలిపారు. శ్రీకా కుళం జిల్లా లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రాంబాబు ఆటోలో చేపలు కొనేందుకు విశాఖపట్నం వెళ్తున్నాడు. అయితే పోలిపల్లి జాతీ య రహదారి సమీపానికి వచ్చేసరికి ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రాంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో డ్రైవర్‌ గాయాలతో బయటపడ్డాడు. మృతుడు చేపల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిం చుకుంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 12:48 AM