Share News

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:16 AM

విద్యుత్‌ స్తంభాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యా యి.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో

  • ఐదుగురికి గాయాలు

వంగర , జూలై 3(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ స్తంభాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యా యి. ఈ ఘటన మద్దివలస గ్రామం లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. తెర్లాం, బలిజిపేట మండలాలకు చెందిన పలువురు గరుగుబిల్లి మండలం కెల్ల గ్రామానికి పెళ్లికి ఆటోలో వెళ్లారు. తిరిగి రాత్రి అదే ఆటోపై వస్తుండగా.. తలగాం గ్రామం వద్ద ఆటో విద్యుత్‌ స్తంభా న్ని ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కొందరు బయటకు తుళ్లిపోయి గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో తెర్లాం గ్రామానికి చెందిన గౌరమ్మ, పెంటన్నాయుడులకు తీవ్ర గాయాలు కాగా, బలిజి పేటకు చెందిన సింహాలు, అంజలి, చిన్నారావులకు స్వల్ప గాయాలయ్యాయి. వేకువజామున ప్రమాదం జరగటంతో ఎవరూ అందుబాటులో లేక క్షతగాత్రులు చాలా సమయం అదే ప్రదేశంలో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కొంత సమయానికి గ్రామస్థులు.. 108 వాహన సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది క్షతగాత్రులను రాజాం ఆసుపత్రికి తరలించా రు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ షేక్‌శంకర్‌ తెలిపారు.

Updated Date - Jul 04 , 2026 | 12:16 AM