ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:19 AM
మండల పరిధిలోని గార్రాజు చీపురు పల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోడూరు రాము(35) రాజయ్యపేట సమీప తోటపల్లి కాలువ పక్కన ఉన్న చెట్టుకు శనివారం ఉరివేసుకున్నాడు.
రాజాం రూరల్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని గార్రాజు చీపురు పల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోడూరు రాము(35) రాజయ్యపేట సమీప తోటపల్లి కాలువ పక్కన ఉన్న చెట్టుకు శనివారం ఉరివేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో రాముకి చెందిన ఆటోను పొలీసులు గుర్తించారు. మృతుడి కి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రాముకు ఎంజే వలసకు చెందిన ఓ మహి ళతో అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని గ్రామస్థులు చెబుతున్నారు. రాజాం పొలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.