Share News

ఆటో డ్రైవర్‌కు 14 రోజుల జైలు శిక్ష

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:16 AM

మద్యం తాగి 25 మంది ప్రయాణికులను ఎక్కించుకుని ఇన్సూరెన్స్‌ లేకుండా ఆటో నడుపుతున్న డ్రైవర్‌కు 14 రోజుల జైలు శిక్షను గజపతినగరం ఫస్ట్‌క్లాస్‌ మున్సిబు కోర్టు న్యాయాధికారి ఎ.విజయ్‌రాజ్‌ కుమార్‌ సోమవారం తీర్పు ఇచ్చినట్టు ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపారు.

  ఆటో డ్రైవర్‌కు 14 రోజుల జైలు శిక్ష

బొండపల్లి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): మద్యం తాగి 25 మంది ప్రయాణికులను ఎక్కించుకుని ఇన్సూరెన్స్‌ లేకుండా ఆటో నడుపుతున్న డ్రైవర్‌కు 14 రోజుల జైలు శిక్షను గజపతినగరం ఫస్ట్‌క్లాస్‌ మున్సిబు కోర్టు న్యాయాధికారి ఎ.విజయ్‌రాజ్‌ కుమార్‌ సోమవారం తీర్పు ఇచ్చినట్టు ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపారు. మండలం లోని కెరటాం గ్రామానికి చెందిన తలే నారాయణ తన ఆటోలో పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించడంతో పాటు మద్యం తాగి డ్రైవింగ్‌ చేయడంతో పట్టుకు న్నామని ఎస్‌ఐ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, న్యాయాధికారి ఎదుట హాజరు పరచగా.. 14రోజలు జైలు శిక్ష విధించారని తెలిపారు.

Updated Date - Apr 07 , 2026 | 12:16 AM