ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటోడ్రైవర్ మృతి
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:09 AM
కొత్తవలస పంచాయతీ అర్దానపాలెం గ్రామ సమీపంలో శనివారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఆటోడ్రైవర్ అక్కడక్కడే మృతిచెందాడు.
కొత్తవలస, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస పంచాయతీ అర్దానపాలెం గ్రామ సమీపంలో శనివారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఆటోడ్రైవర్ అక్కడక్కడే మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. కొత్తవలస నుంచి అలమండ వైపు వెళ్తున్న ఆటోను విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అర్దానపాలెం గ్రామ సమీపంలో ఢీకొట్టింది. దీంతో అలమండ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అప్పికొండ పరదేశి(35) అక్కడకక్కడే మృతిచెందాడు. మృతి చెందిన పరదేశి భార్య శశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జోగారావు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదే హాన్ని ఎస్.కోట తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.