ఆటో, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరి మృతి
ABN , Publish Date - May 23 , 2026 | 11:55 PM
మండలంలోని గరికపాడు, తాలాడ గ్రామా ల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.అగ్రహారానికి చెందిన పైల నాగేశ్వరరావు(52) అనే వ్యక్తి మృతిచెందారు.
సంతకవిటి, మే 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని గరికపాడు, తాలాడ గ్రామా ల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.అగ్రహారానికి చెందిన పైల నాగేశ్వరరావు(52) అనే వ్యక్తి మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. సంత కవిటి నుంచి రాజాం వైపు ఓ ఆటో వస్తుండగా.. రాజాం నుంచి సంతకవిటి వైపు నాగేశ్వరరావు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ రెండు వాహనాలు గరికపాడు, తాలాడ గ్రామల మధ్య ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను రాజాంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిం చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆయన మృతిచెం దారు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు సాయికుమార్, కుమార్తెలు మణి, దివ్యలు ఉన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారి రోదనలు స్థానికులను కంటత డి పెట్టించాయి.