సిరిమానోత్సవానికి పక్కాగా పురసేవలు’
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:27 AM
పట్టణంలో ఈ నెల 26 నుంచి జరగనున్న సరేపోలమ్మ సిరిమానోత్సవంలో భక్తులు, స్థానికులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ నుంచి అన్ని రకాల సేవలను పగడ్బందీగా అందించాలని అధికారులను కమిషనర్ రామలక్ష్మి ఆదేశించారు.
బొబ్బిలి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఈ నెల 26 నుంచి జరగనున్న సరేపోలమ్మ సిరిమానోత్సవంలో భక్తులు, స్థానికులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ నుంచి అన్ని రకాల సేవలను పగడ్బందీగా అందించాలని అధికారులను కమిషనర్ రామలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం ఆమె పట్టణంలో పర్యటించారు. సిరిమానోత్సవం నేపథ్యంలో కోవెల వద్ద, రథం తిరిగే ప్రాంతాలను ఆమె ఆలయధర్మకర్త చోడిగంజి రమేష్‌నాయుడు ఇతర పెద్దలతో కలిసి పరిశీలించారు. సిరిమాను తిరిగే ప్రాంతాలలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆక్రమణలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో లోపం ఉండరాదని, క్లోరినేషన్ సక్రమంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్యానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఆమె వెంట ఏఈ లు, టీపీఎస్, పబ్లిక్ హెల్త్ మేస్ర్తీలు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.