Share News

విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:05 AM

దసరా సెలవులు అనంతరం పాఠశాలకు తిరిగి వచ్చిన గిరిజన విద్యార్థినుల ఆరో గ్యం, ఆహారం, వసతి సౌకర్యా లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జేసీ ఆర్‌.వైశాలి ఆదేశించారు.

  విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీలో రికార్డులు పరిశీలిస్తున్న వైశాలి :

కొమరాడ, అక్టోబరు 22 (ఆం ధ్రజ్యోతి): దసరా సెలవులు అనంతరం పాఠశాలకు తిరిగి వచ్చిన గిరిజన విద్యార్థినుల ఆరో గ్యం, ఆహారం, వసతి సౌకర్యా లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జేసీ ఆర్‌.వైశాలి ఆదేశించారు. గురువారం ఉలిపిరి గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠ శాలలో పారిశుధ్యం, వంటగది, మరుగుదొడ్లు నిర్వహణను పరి శీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, అనా రోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం అందించాలని సూచిం చారు. పరిశుభ్రమైన వాతావరణం, సురక్షిత తాగునీరు, నాణ్యమైన ఆహా రం అందించాలని, వ్యక్తిగత పరిశుభ్రత విద్యార్థినులకు అవగాహన కల్పించాలని అధికారులు, ఉపాధ్యాయులకు ఆదేశించారు. అనంతరం కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీలో పారిశుధ్యం, వైద్యసేవలు, మందులు నిల్వలు, పరికరాలు, సిబ్బంది హాజరు, రోగుల రికార్డులు పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులోఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - Oct 23 , 2026 | 12:05 AM