Share News

వ్యక్తిపై హత్యాయత్నం

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:29 AM

డబ్బులు కావాలంటూ ఓ యువకుడు తన తల్లిదండ్రులపై దాడి చేస్తుండగా అడ్డుకున్న వ్యక్తిపై కూడా హత్యా యత్నా నికి పాల్పడ్డాడు.

వ్యక్తిపై హత్యాయత్నం

గంట్యాడ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): డబ్బులు కావాలంటూ ఓ యువకుడు తన తల్లిదండ్రులపై దాడి చేస్తుండగా అడ్డుకున్న వ్యక్తిపై కూడా హత్యా యత్నా నికి పాల్పడ్డాడు. ఈ ఘటన గంట్యాడ మండలంలోని మదుపాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మదుపాడ గ్రామానికి చెందిన సీహెచ్‌ విజయకుమార్‌ తన తల్లిదండ్రులైన సన్యాసిప్పడు, ఈశ్వరమ్మ లను డబ్బులు కావాలంటూ సోమవారం సాయంత్రం డిమాండ్‌ చేశాడు. డబ్బు లు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులపై దాడికి ప్రయత్నించాడు. ఇంతలో తన ఇంటి కి సమీపంలో ఉన్న ద్వారపురెడ్డి కృష్ణ వచ్చి, అడ్డుకున్నారు. దీంతో విజయ కుమార్‌.. కృష్ణపై ఓ ఆయుధంతో దాడి చేయడంతో చెవికి బలమైన గాయమైంది. వెంటనే కుటుంబీకులు కృష్ణను ఎస్‌.కోట ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయం పై గంట్యాడ ఎస్‌ఐ సాయికృష్ణ వద్ద ప్రస్తావించగా హత్యయత్నం జరిగినట్టు ఫిర్యాదు వచ్చిందని, తమ సిబ్బందిని గ్రామానికి పంపించి విచారణ చేయిస్తు న్నామని వెల్లడించారు.

Updated Date - Sep 08 , 2026 | 12:29 AM