Share News

టీ షాపు నిర్వాహకుడిపై హత్యాయత్నం

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:13 AM

రాజాపులోవ గ్రామ పరిధిలోని జాతీ య రహదారి సమీపంలో టీ దుకాణం నిర్వహిస్తున్న రుద్ర అప్పలనాయుడుపై శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన కిలారి శ్రీను అలియాస్‌ డీజే శ్రీను అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

టీ షాపు నిర్వాహకుడిపై హత్యాయత్నం

  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు

భోగాపురం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాజాపులోవ గ్రామ పరిధిలోని జాతీ య రహదారి సమీపంలో టీ దుకాణం నిర్వహిస్తున్న రుద్ర అప్పలనాయుడుపై శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన కిలారి శ్రీను అలియాస్‌ డీజే శ్రీను అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లకు తెలిపారు. ఆయ న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజాపులోవ గ్రామానికి చెందిన అప్పల నాయుడు జాతీయ రహదారి సమీపంలో టీ దుకాణం పెట్టుకుని జీవనం సాగి స్తున్నాడు. అయితే శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన కిలారి శ్రీను అలి యాస్‌ డీజే శ్రీను అక్కడకు వచ్చి టీ కావాలని అడిగాడు. అయితే పాత బాకీ ఇవ్వాలని లేదంటే టీ ఇవ్వనని అప్పలనాయుడు తెలిపాడు. అనంతరం షాపు మూసే ప్రయత్నం చేస్తుండగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో శ్రీను.. షాపులో ఉన్న చాకును తీసుకుని అప్పలనాయుడిపై దాడికి ప్రయత్నించా డు. ఈ పెనుగులాటలో అప్పలనాయుడికి గాయాలయ్యాయి. సమాచారం అందు కున్న పోలీసులు అక్కడకు చేరుకుని, అప్పలనాయుడిని సుందరపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత విశాఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే డీజే శ్రీనుపై భీమిలిలో హత్యాయత్నం కేసు ఉండడంతో పోలీసులు రౌడీషీటు తెరిచా రు. ఈ కేసును ఎస్‌ఐ దామోదరరావు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడి, నిందితుడిని పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

Updated Date - Sep 07 , 2026 | 12:13 AM