Share News

మహిళపై హత్యాయత్నం

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:25 AM

రామచంద్రపేట గ్రామానికి చెందిన రాలి గురమ్మ అనే మహిళ పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డా డు.

మహిళపై హత్యాయత్నం

భోగాపురం, ఆగస్టు 19(ఆంధ్ర జ్యోతి): రామచంద్రపేట గ్రామానికి చెందిన రాలి గురమ్మ అనే మహిళ పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డా డు. వివరాలిలా ఉన్నాయి. గుర మ్మ బుధవారం కొండ్రాజుపాలెం నుంచి రామచంద్రపేట వస్తుండగా మార్గ మధ్యంలో జీడితోట సమీపం లో ఓ గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆమె మెడపై దాడి చేశాడు. రక్తస్రావం జరగడంతో ఆమె భయాందోళనతో పరిగెత్తింది. అయితే దేనితో దాడి చేశారో, దాడి చేసిన వ్యక్తి ఆడో.. మగో గుర్తించలేకపోయానని బాధితురాలు తెలిపింది. అనంతరం స్థానికులు సుందరపేట ఆసుపత్రికి తీసుకొచ్చి చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని విచారించారు. బాధితు రాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.

Updated Date - Aug 20 , 2026 | 12:25 AM