వైసీపీ హయాంలోనే దళితులపై దాడులు
ABN , Publish Date - May 20 , 2026 | 12:10 AM
వైసీపీ ప్రభుత్వంలోనే దళితులపై దాడులు పెద్దఎత్తున జరిగాయని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి విమర్శించారు.
గుమ్మలక్ష్మీపురం, మే 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలోనే దళితులపై దాడులు పెద్దఎత్తున జరిగాయని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి విమర్శించారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ నమ్మించి మోసం చేశార న్నారు. మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాల యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 200 మందికి పైగా దళితులు హత్యకు గుర య్యారన్నారు. దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న ఘటనలు జగన్ పాలనలో దళితుల పరిస్థితిని ప్రతిబింబిస్తు న్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించిన గణాంకాలు ప్రకారం టీడీపీ పాలనలో 8211 దాడులు జరిగితే, వైసీపీ పాలనలో 56,981 దాడులు నమోదయ్యా యన్నారు. అన్నమయ్య జిల్లాలో వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి తన అను చరులతో కలిసి ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీపీ చాంబర్ తాళాలు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చి ఇవ్వ లేమని చెప్పడంతో ఎంపీడీవోపై దాడి చేశారని ఆరోపించారు. అడ్డుకున్న అటెండర్ కారు డ్రైవర్‌పై దాడి చేసి ఎంపీపీ గది తాళాలు పగలగొట్టారన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంత్‌బాబుపై చర్యలు తీసుకోలేదన్నారు. తాడిపత్రిలో దళిత సీఐను కులంపేరుతో అవమానించారని, ఇసుక దందాను ప్రశ్నించిన వరప్రసాద్‌కు శిరోముండనం చేశారన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన అనూష, ధర్మవరం జాతీయ స్థాయిలో క్రీడాకారిణి స్నేహాలత, రాజమండ్రిలో పదో తరగతి విద్యార్థిని ఘటన ల్లో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదన్నారు. ఐదేళ్లలో జగన్ దళితులపై చూపించింది కపట ప్రేమేనని జగదీశ్వరి విమర్శించారు.