Share News

క్రీడాకారులకు శిక్షణ అవసరం

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:27 AM

జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారు లను గుర్తించి వారికి సరైన వేదికను కల్పించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి చాంపియన్లుగా తీర్చిదిద్దడమే ధ్యేయమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

క్రీడాకారులకు శిక్షణ అవసరం
జెండాఊపి క్రీడాపోటీలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి::

పార్వతీపురం రూరల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారు లను గుర్తించి వారికి సరైన వేదికను కల్పించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి చాంపియన్లుగా తీర్చిదిద్దడమే ధ్యేయమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే క్రీడాకారులకు నిరంతర శిక్షణ అవసరమని చెప్పారు. సోమవారం మండలం లోని నర్సిపురం జడ్పీ ఉన్నతపాఠశాల ఆవరణ లో క్రీడాపాఠశాల విద్యార్థుల ఎంపిక ప్రక్రియకు కలెక్టర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ విద్యార్థుల్లోని శారీరక సామర్థ్యం, నైపుణ్య పరీక్షలు ఎంపిక ఈనెల 27 వరకు జరుగుతా యన్నారు. షటిల్‌ రన్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌, ప్లెక్సిబిలిటి పరీక్ష, వర్టికల్‌ జంప్‌, మెడిసిన్‌ బాల్‌ వంటిపోటీలు నిర్వహిస్తారన్నారు.ఎంపికైన క్రీడా కారులకు క్రీడా పాఠశాలల్లో ఉచిత వసతి, పౌష్టి కాహారం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కోచింగ్‌ అందించనున్నట్లుతెలిపారు. కార్యక్రమం లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీధరరావు, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:27 AM