Share News

upadhi ఉపాధికి భరోసా

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:30 AM

Assurance of upadhi ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, ఆజీవిక మిషన్‌) కింద జిల్లాలో పలుచోట్ల విస్తృతంగా పనులు జరుగుతున్నాయి. అయితే ఈ నూతన పథకంలో నిబంధనలు వేతనదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ప్రధానంగా ఉపాధి కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే పనులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

  upadhi  ఉపాధికి భరోసా

  • పనుల ప్రాంతం ఐదు కిలోమీటర్లు దాటితే పది శాతం అదనపు వేతనం

  • 33 శాతం మహిళా వేతనదారులు ఉండాల్సిందే..

  • వేతనజీవులకు ఉపయుక్తంగా వీబీ జీ రామ్‌జీ

పార్వతీపురం, జూలై5(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, ఆజీవిక మిషన్‌) కింద జిల్లాలో పలుచోట్ల విస్తృతంగా పనులు జరుగుతున్నాయి. అయితే ఈ నూతన పథకంలో నిబంధనలు వేతనదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ప్రధానంగా ఉపాధి కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే పనులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అదేవిధంగా జాబ్‌కార్డు కలిగిన వారందరికీ 125 రోజుల పాటు పనులు కల్పించాలి. ఒక్కో బ్యాచ్‌లో సంఖ్యను బట్టి 33 శాతం మహిళా వేతనదారులు ఉండేలా చూసుకోవాలి. వేతనదా రులకు ఐదు కిలోమీటర్ల దూరంలోనే వీబీ జీ రామ్‌జీ ద్వారా పనులు కల్పించాలి. ఐదు కిలో మీటర్లు పరిధి దాటితే అక్కడ పనులు చేపట్టే వారికి పది శాతం అదనంగా వేతనం చెల్లించాల్సి ఉంది. వేతనాలన్నీ వేతనదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. జిల్లాలో 15 మండ లాల్లోని 450 గ్రామ పంచాయతీల్లో 2.13 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వాటిల్లో 1.95 లక్షలు జాబ్‌కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. 3.46 లక్షల మంది వేతనదారులు పనులకు హాజరవుతున్నారు.

ఈ పనులకే ప్రాధాన్యం..

వీబీ జీ రామ్‌జీ పథకంలో కేటగిరీ-1 కింద ఫాంపాండ్స్‌, ఇరిగేషన్‌ కాలువలు, వాటర్‌షెడ్స్‌ తదితర పనులు చేపట్టనున్నారు. ప్రధానంగా చెరువుల అభివృద్ధి, మొక్కలు పెంపకంతో పాటు ఫీడర్‌ చానల్‌ను ప్రారంభించనున్నారు. కేటగిరీ-2 కింద రహదారులు, కల్వర్టులు, పాఠశాలల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలతో పాటు శానిటేషన్‌ పనులు చేపట్టనున్నారు. కేటగిరీ-3 కింద లైవ్లీహుడ్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ పనులు, పల్లెల్లో మార్కెట్‌ ప్రాంతాల్లోని భవనాలు, స్టోరేజ్‌ గోడౌన్స్‌, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ భవనాల నిర్మాణాలు చేపడతారు. కేటగిరీ-4 కింద తుఫాన్‌ షెల్టర్లు, కం ట్రోల్‌ స్రక్చర్లు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు మంజూరు చేయనున్నాయి.

నిబంధనల ప్రకారం ఉపాధి కల్పిస్తాం...

ఉపాధి కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి వీబీ జీ రామ్‌జీ నిబంధనల ప్రకారం 15 రోజుల్లోపు పనులు కల్పిస్తాం. జాబ్‌కార్డు హోల్డర్‌కు మొత్తంగా 125 రోజుల పాటు పనిదినాలను కల్పిస్తాం. ఈ పథకంలో నాలుగు కేటగిరీలుగా అభివృద్ధి పనులు చేపడతాం.

- రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం మన్యం

Updated Date - Jul 06 , 2026 | 12:30 AM