పేదల ఆర్యోగానికి భరోసా
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:52 PM
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. బుధవారం మండ లంలోని జి.ములగాం, ఇటకర్లపల్లిల్లో రూ.1,90,412ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
చీపురుపల్లి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. బుధవారం మండ లంలోని జి.ములగాం, ఇటకర్లపల్లిల్లో రూ.1,90,412ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లిక్‌నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేస్తు న్న పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందజేయడంతో వారిలో విశ్వాసం పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చెర్మన్ అలమండ నరసింహమూర్తి, నాయకులు గంట్యాడ సత్యన్నారాయణ, గడే సన్యాసప్పలనాయుడు, మీసాల నవీన్ పాల్గొన్నారు.
ఫగరివిడి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని అర్తమూరు గ్రామానికి చెందిన పి.సత్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.40,795ల చెక్కును టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు బుధ వారం పంపిణీచేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పైల బలరాం, టీడీపీ మండ లాధ్యక్షుడు ఎస్.సురేష్, మాజీ సర్పంచ్ మహంతి రమణమూర్తి, జిల్లా టీడీపీ ఉపా ధ్యక్షుడు వెంపడాపు రమణమూర్తి పాల్గొన్నారు.