మున్సిపల్ చైర్‌పర్సన్ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:02 AM
స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తమ చాంబర్‌లో గురువారం ఉదయం మున్సిపల్ చైర్‌పర్సన్ రాంబార్కి రేణుకాదేవి అడుగుపెట్టారు.
బొబ్బిలి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తమ చాంబర్‌లో గురువారం ఉదయం మున్సిపల్ చైర్‌పర్సన్ రాంబార్కి రేణుకాదేవి అడుగుపెట్టారు. వేదపండితుల ఆశీర్వాదాలు, ప్రత్యేక పూజల నడుమ చైర్‌పర్సన్ బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు ఎమ్మెల్యే బేబీనాయన, మాజీ మంత్రి సుజయ్ కృష్ణరంగారావు, జడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, మాజీ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబు తదితరులున్నారు.
వైస్ చైర్‌పర్సన్ సునీతకు అభినందనలు
వైస్‌చైర్‌పర్సన్ రేజేటి సునీత-విస్సు దంపతులను పార్టీ పెద్దలు బేబీ నాయన, చిన్నశీను, సుజయ్, తెంటు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి తదితరులు ఘనంగా సత్కరించారు. అలాగే చైర్‌పర్సన్ రాంబార్కి దంపతులు.. సునీతను సత్కరించారు.