నేతన్నలకు సాయం అందజేత
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:32 AM
ఎస్.కోట నియోజ కవర్గంలో అర్హులైన చేనేత కార్మకులకు ఎమ్మెల్యే లలిత కుమారి ఆదివారం ఎల్.కోటలోని తమ నివాసం వద్ద నేతన్నల సాయాన్ని అందజేశా రు.
లక్కవరపుకోట, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఎస్.కోట నియోజ కవర్గంలో అర్హులైన చేనేత కార్మకులకు ఎమ్మెల్యే లలిత కుమారి ఆదివారం ఎల్.కోటలోని తమ నివాసం వద్ద నేతన్నల సాయాన్ని అందజేశా రు. 11 మంది నేతల కార్మికులకు ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున అందజేశారు. అనంతరం తలారి గ్రామంలో ఉపాధి పథకంలో రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కరెడ్ల ఈశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు మరోతి రామారావు, నాయకులు పాల్గొన్నారు.