Share News

Ashada Sare కోటదుర్గమ్మకు ఆషాఢం సారె

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:22 AM

Ashada Sare Offered to Kotadurgamma ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ ఆషాఢమాస శాకంబరి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Ashada Sare   కోటదుర్గమ్మకు ఆషాఢం సారె
అమ్మవారికి సారె తీసుకొస్తున్న భక్తులు, అర్చకులు, ఈవో

  • ఆలయానికి తరలివచ్చిన భక్తులు

పాలకొండ, జూలై27(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ ఆషాఢమాస శాకంబరి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 300 మంది మహిళలు వివిధ రకాల స్వీట్లు, అరిసెలు, చీరలు, పూలు, పండ్లుతో సారెను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ మండపంలో సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ పూజల్లో ఈవో వీవీ సూర్యనారాయణ , అర్చకులు మణీల్‌శర్మ, ప్రసాదరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 12:22 AM