Share News

ఇద్దరు నిందితుల అరెస్టు

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:08 AM

తక్కువ ధరకే బంగారం ఇస్తా మని ఆశచూపి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి రూ.2 లక్షలు అపహరిం చిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ఏఎస్పీ మనీషారెడ్డి తెలిపారు.

ఇద్దరు నిందితుల అరెస్టు

బెలగాం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): తక్కువ ధరకే బంగారం ఇస్తా మని ఆశచూపి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి రూ.2 లక్షలు అపహరిం చిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ఏఎస్పీ మనీషారెడ్డి తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సంబంధిత వివరాలను ఆమె వెల్లడించారు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన రాజు.. తమ వద్ద బంగారు కడ్డీలు ఉన్నాయని, తక్కువ ధరకు ఇప్పిస్తానని ఫోన్‌లో విజయవాడకు చెందిన శ్రీనివాసరావుకు తెలిపాడు. దాంతో శ్రీనివాసరావు, తన స్నేహితుడితో కలిసి మండలంలోని అడ్డూరువలస ప్రాంతానికి వెళ్లాడు. దాంతో రాజుతో పాటు మరి కొంతమంది దాడి చేసి రూ.2 లక్షల నగదు అపహరించారు. దాంతో బాధితులు రూరల్‌ స్టేషన్‌లో ఈనెల 7న ఫిర్యాదు చేశారు. రూరల్‌ సీఐ రంగనాఽథ్‌ దర్యాప్తు నిర్వహించి ఈ కేసులో ఐదుగురు ఉన్నట్టు గుర్తించారు. నిందితులు అందరూ ఒడిశా రా ష్ర్టానికి చెందినవారన్నారు. వారిలో మీనక నారాయణరావు (రాజు), హబిక సన్నులను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.60 వేలు నగదు, రెండు ద్విచ క్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. . మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. గత నెల అడ్డూరివలస వద్ద వస్త్ర వ్యా పారిపై జరిగిన దాడి కేసులో కూడ వీరి ప్రమేయం ఉన్నట్టు నిర్ధరించామన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ రంగనాథ్‌, ఎస్‌ఐ రాజేశ్‌ ఉన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:08 AM