Share News

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:24 AM

జిల్లాలో మార్చి రెండు నుంచి 13వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి :

పార్వతీపురం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మార్చి రెండు నుంచి 13వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏపీ ఓపెన్‌ స్కూల్‌పరీక్షలకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతికి ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇంటర్‌ విద్యార్థులకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. పరీక్షలను మూడుఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షిస్తాయన్నా రు. పదో తరగతి పరీక్షలకు 23 మంది ఇన్విజిలేటర్లను, ఇంటర్‌ విద్యార్థుల కోసం 15 మంది ఇన్విజిలేటర్లను కేటాయించామన్నారు. పది పరీక్షలకు రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులు కలిపి 568 మంది, ఇంటర్‌ రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులు 356 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. పరీ క్షకేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమావేశంలో డీఆర్వో హేమలత, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు పాల్గొన్నారు.

‘మార్ట్‌’తో ఆర్థిక ముఖచిత్రం మారాలి

మార్ట్‌ ప్రాజెక్టు అమలుతో జిల్లాలో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మా రాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. మన్యం జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో మార్ట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్ట తెలిపారు కలెక్టర్‌ కార్యాలయ సమా వేశ మందిరంలో మార్ట్‌ అమలుపై కలెక్టర్‌ సంబంధిత శాఖాధికారులతో సమీక్షించారు. జిల్లాలోని రైతులు,పాడి రైతులు, గ్రామీణ వృత్తిదారుల ఆదాయాన్ని మెరుగుపరచడం ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో మురళీధర్‌, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి పాల్గొన్నారు.

డిప్యుటేషన్లు రద్దుచేయాలి

రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో డీటీ, సర్వేయర్ల డిప్యుటేషన్లు రద్దు చేయాలని జలవనరులశాఖ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ కలెక్టర్లను కోరారు. రెవెన్యూ తదితర అంశాలపై అమ రావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం సీసీఎల్‌ఏ ముఖ్య కమిష నర్‌ జి.జయలక్ష్మితో కలిసి వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించారు. రీసర్వే జరిగే గ్రామా ల్లోని సర్వేయర్లు తప్పనిసరిగా సంబంధిత గ్రామంలోనే ఉండేలా చర్యలు తీసుకోవా లన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకం పంపిణీ ప్ర క్రియ వేగవంతం కావాలన్నారు. కార్య క్రమంలో కలెక్టర్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:24 AM