Share News

టీడీపీ అరకు పార్లమెంట్‌ కార్యాలయం శంకుస్థాపనకు ఏర్పాట్లు

ABN , Publish Date - May 11 , 2026 | 12:29 AM

టీడీపీ అరకు పార్లమెంట్‌ నియోజక వర్గ కార్యాలయ నిర్మాణానికి సోమవారం పార్వతీపురంలో శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చెప్పారు.

 టీడీపీ అరకు పార్లమెంట్‌ కార్యాలయం శంకుస్థాపనకు ఏర్పాట్లు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం, మే10(ఆంధ్రజ్యోతి): టీడీపీ అరకు పార్లమెంట్‌ నియోజక వర్గ కార్యాలయ నిర్మాణానికి సోమవారం పార్వతీపురంలో శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చెప్పారు. ఆదివారం పార్వతీ పురం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడు తూ.. శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, అరకు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు హాజరవుతారన్నారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయం నిర్మించనున్న స్థలాన్ని పరిశీలిం చారు. ఆ ప్రాంతంలో చేపడుతున్న ఏర్పాట్లపై సూచనలిచ్చారు. శంకుస్థాపన అనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యకర్తలు, నేతలతో చర్చించారు. ఈ పరిశీలనలో నాయకులు వెంకటనాయుడు, దేవి చంద్రమౌళి, వేణు, మధు, వెంకటేష్‌, జి.రవికుమార్‌, ఆర్‌.శివ తదితరులు పాల్గొన్నారు. కాగా రెవెన్యూ అధికారులు ఖరారు చేసిన స్థలంపై కోర్టు స్టేటస్‌ కో విధించడంతో వేరే ప్రాంతంలో కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. స్థల వివా దం నేపథ్యంలో చివరి నిమిషంలో శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

Updated Date - May 11 , 2026 | 12:30 AM