దివ్యాంగుల రాష్ట్ర స్థాయి పోటీలకు ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:05 AM
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్క రించుకుని డిసెంబరు 2, 3 తేదీల్లో విజయనగరం రాజీ వ్ క్రీడా మైదానంలో నిర్వహించనునన్న రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ పోటీలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు.
డిసెంబరు 1, 2 తేదీల్లో నిర్వహణ
అధికారులతో కలెక్టర్ రామసుందర్‌రెడ్డి సమీక్ష
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 21(ఆంధ్రజ్యో తి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్క రించుకుని డిసెంబరు 2, 3 తేదీల్లో విజయనగరం రాజీ వ్ క్రీడా మైదానంలో నిర్వహించనునన్న రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ పోటీలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. పోటీల నిర్వ హణపై శనివారం ఆయన సంబంధిత శాఖాధికారు లతో వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, పలు సూచన లు, ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి పోటీల కు హాజరయ్యే క్రీడాకారులు ఎక్కడ నుంచి వస్తున్నా రు, వారి సంఖ్య ఎంత, వారిలో ఎవరెవరికి నిబంధనల ప్రకారం ప్రత్యేక ఎస్కార్ట్ సహాయం అవసరం వంటి అంశాలను ముందుగానే గుర్తించి, సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి క్రీడాకారుడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాకపోకల నుంచి తిరుగు ప్ర యాణం వరకూ అవసరమైన సహకారం అందించా లని సూచించారు. దివ్యాంగ క్రీడాకారులకు సహాయ సహకారులు అందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని సూ చించారు. క్రీడాకారులకు కేటాయించే కల్యాణ మండ పాలు, ఇతర వసతి కేంద్రాల్లో తప్పనిసరిగా టాయిలెట్ సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ పోటీల్లో పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్ (సింగిల్), పారా తైక్వాండో, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్ బాల్ తదితర ఆరు క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సుమారు 200 మంది దివ్యాంగ క్రీడాకారులు, 500 మంది సహాయకులు పాల్గొనే అవకాశం ఉందన్నారు.