సిరిమాను తరలింపునకు ఏర్పాట్లు: ఎస్పీ
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:02 AM
రోడ్ల నిర్మాణంతోనే గ్రామాలు అభివృద్ధి సాధి స్తాయని, ఇదే ఉద్దేశంతో నిర్మాణాలు చేపడుతున్నా మని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
విజయనగరం, అక్టోబరు 12 ( ఆంధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమాను తర లింపు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని ఎస్పీ దామోదర్ పోలీసు అధికా రులను ఆదేశించారు. సోమవారం జొన్నవలసలో సిరిమాను చెట్టు తరలింపు ప్రక్రియలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి చేపట్టాల్సిన భద్రతా ఏర్పా ట్లపై సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మణమూర్తి, దేవదాయశాఖ కమిషనర్ శిరీష, పూజారి వెంకటరావు, సీఐలు లీలారావు, టి.శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, దేవదాయ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
విజయనగరం అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రజలు నుంచి వచ్చిన ఫిర్యాదు లను స్వీకరించి తక్షణమే స్పందించి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ కోరారు. సోమవారం విజయనగరంలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబందిత అధికారులకు సలహాలు ఇచ్చి చట్టపరిధిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.