Share News

ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు: ఆర్వో

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:10 AM

ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధంగా ఉన్నామని ఎన్నికల రిటర్నింగ్‌(ఆర్వో) అధికారి బాలాజీ ఒకప్రకటనలో తెలిపారు.

ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు: ఆర్వో
మండల పరిషత్‌ కార్యాలయంలో సిద్ధంచేసిన పోలింగ్‌ సామగ్రి :

బొండపల్లి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధంగా ఉన్నామని ఎన్నికల రిటర్నింగ్‌(ఆర్వో) అధికారి బాలాజీ ఒకప్రకటనలో తెలిపారు. 15 ఎంపీటీసీతోపాటు జడ్పీటీసీకి సంబంధించి 53 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. మండలంలో పోస్టల్‌ ఓటర్లకు సంబంధించి 200 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికలు నిర్వహణకు 283 మంది పీవోలు, ఏపీవోలను ఎన్నికల నిర్వహ ణకు గుర్తించి వారికి శిక్షణ కూడా ఇచ్చినట్ల్లు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన పోలింగ్‌తేదీతోపాటు ఓట్ల లెక్కింపు తేదీలు ఎన్నికల కమిషన్‌ మార్చినట్లు తెలిపారు. వచ్చే నెల మూడో తేదీన జరగాల్సిన పోలింగ్‌ ఐదో తేదీన, లెక్కింపును ఏడో తేదీకి మార్చుతూ ఉత్తర్వులు వచ్చాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు.

Updated Date - Oct 29 , 2026 | 12:10 AM