Share News

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:27 PM

సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా ఎల్లప్పుడూ పని చేస్తుందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. గత ఏడాదిలాగే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లుచేయనున్నట్లు చెప్పారు.

 ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు

చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు

చీపురుపల్లి, నవంబరు 11 (ఆంధ్రజ్యో తి): సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా ఎల్లప్పుడూ పని చేస్తుందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. గత ఏడాదిలాగే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లుచేయనున్నట్లు చెప్పారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తలెత్తిన చిన్నపాటి లోపాలను సరిదిద్దుకొని ముందుకుసాగుతామన్నారు. బుధవారం చీపురుపల్లిలో విలేకరులతో మా ట్లాడుతూ పార్టీ రహితంగా జరగనున్న ఈ ఎన్నికల్లో కూడా స్థానికంగా ఉన్న పరి స్థితులు, అవకాశాలను బట్టి కూటమిలోని ఇతర పార్టీలకు అవకాశమిస్తామని తెలి పారు. పార్టీలకతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కుటుంబ పరి స్థితులు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని చెప్పారు. ఈమేరకు టీడీపీ నాయ కుడు రౌతు కామునాయుడును చీపురుపల్లి మేజరు పంచాయతీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. చీపురుపల్లి, గరివిడి పంచాయతీల్లో తామే విజయం సాధిస్తా మని చెప్పారు. పీఏసీఎస్‌లు, ఉత్సాహవంతమైన డ్వాక్రా సంఘాలకు ధాన్యం కొనుగోలు బాధ్యత అప్పగించనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఈ కొనుగోళ్లు జరుగుతాయన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, సారేపాక సురేష్‌, కోట్ల మోతీలాల్‌నాయుడు, సువ్వాడఅప్పలనాయుడు, ముల్లు రమణ పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:27 PM