10th Class Evaluation టెన్త్ మూల్యాంకనానికి ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:11 AM
Arrangements for Class 10 Evaluation జిల్లా కేంద్రంలో టెన్త్ మూల్యాంకనానికి (స్పాట్ వాల్యూయేషన్ ) విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 6 నుంచి స్పాట్ వాల్యూయేషన్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు. పార్వతీపురంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇంగ్లీషు, సోషల్, డీవీఎం ఉన్నత పాఠశాలలో గణితం, సైన్స్‌కు సంబంధించి రెండు పేపర్లను దిద్దనున్నారు.
సాలూరు రూరల్, మార్చి30(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో టెన్త్ మూల్యాంకనానికి (స్పాట్ వాల్యూయేషన్ ) విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 6 నుంచి స్పాట్ వాల్యూయేషన్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు. పార్వతీపురంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇంగ్లీషు, సోషల్, డీవీఎం ఉన్నత పాఠశాలలో గణితం, సైన్స్‌కు సంబంధించి రెండు పేపర్లను దిద్దనున్నారు. ఈ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాలకు ఇతర జిల్లాల విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను రానున్నాయి. వాటిని దిద్దడానికి ఇరువురు ఎగ్జామినర్స్‌కు ఒక సహాయ ఎగ్జామినర్‌ను ఏర్పాటు చేశారు. ఓపెన్ టెన్త్ మూల్యాం కనం అదే సమయంలో ఆయా కేంద్రాల్లో జరగనుంది. మొత్తంగా పదో తరగతి జవాబు పత్రాల వాల్యూయేషన్‌కు 250 వరకు ట్యాబ్‌లను వినియోగించ నున్నారు. ప్రస్తుతం జిల్లాలో 68 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. 10,500 మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ పరీక్షలు వచ్చే నెల2తో ముగియనున్నాయి.