Share News

‘ఆరికతోట సొసైటీని అప్‌గ్రేడ్‌ చేస్తా’

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:22 AM

ఆరికతోట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని అప్‌గ్రేడ్‌ చేయిస్తానని డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు.

‘ఆరికతోట సొసైటీని అప్‌గ్రేడ్‌ చేస్తా’
మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ నాగార్జున

రామభద్రపురం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఆరికతోట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని అప్‌గ్రేడ్‌ చేయిస్తానని డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు. మంగళవారం ఆరికతోట సొసైటీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అర్హత కలిగిన రైతులకు రుణాలు మంజూరు చేస్తానన్నారు. రాయితీపై పనిమట్లు ఇవ్వనున్నామన్నారు. సొసైటీకి చుట్టూ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా ఫర్నీచర్‌ సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు సొసైటీ చైర్మన్‌ జాగాన ప్రసాదరావు, సొసైటీ డైరెక్టర్లు సంగిరెడ్డి ప్రసాదరావు, మరిపి కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు పల్లా చంద్రరావు, పూసర్ల వెంకటరాజు, నల్ల సూర్యనారాయణ, బేత సోమినాయుడు, పెంకి రాము, జనసేన నాయకుడు అల్లు రమేష్‌, కనకల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2026 | 12:22 AM