Share News

Aren't you responsibulty? గోఘోష పట్టదేమీ?

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:23 PM

Aren't you responsibulty? జిల్లాలో నిత్యం పశువులు అక్రమంగా తరలుతూ పట్టుబడుతున్నాయి. మరోవైపు అక్రమంగా నిర్వహిస్తున్న గోవధ శాలలు వెలుగుచూస్తున్నాయి. ఎస్‌.కోట మండలంలోని ఓ గ్రామంలో పెద్ద ఎత్తున గోమాంసం ఇటీవల బయటపడడం బాధాకరం. జిల్లాలో చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది. గుట్టుగా కబేళా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నాగావళి, చంపావతి, గోస్తనీ నదీ తీరాల్లో గోవధ సాగుతోందన్న ఆరోపణలున్నాయి. దీనిపై పక్కా నిఘా పెట్టడం లేదు. పట్టుకున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదు.

Aren't you responsibulty? గోఘోష పట్టదేమీ?

గోఘోష పట్టదేమీ?

జిల్లాలో ఆగని పశువుల అక్రమ రవాణా

వెలుగుచూస్తున్న గోవధ శాలలు

మటన్‌ మాటున పశుమాంసం చలామణి

చోద్యం చూస్తున్న యంతాంగం

- గత నెల 3న విశాఖ జిల్లా నక్కపల్లిలో పశువుల వ్యాన్‌ పట్టుబడింది. విజయనగరం జిల్లా నుంచి సామర్లకోటకు 14 పశువులను వ్యాన్‌లో కుక్కి తీసుకెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అప్పటికే ఊపిరాడక ఒక పశువు మృతిచెందింది.

- ఎస్‌.కోట మండలంలో ఇటీవల పెద్ద ఎత్తున గోమాంసం పట్టుబడింది. మేక మాంసం మాటున గత ఐదు నెలలుగా పశువులను వధించి మాంసం తరలిస్తుండడాన్ని గ్రామస్థులు గుర్తించి గుట్టు రట్టుచేశారు. వందల కిలోల గోమాంసాన్ని పట్టించారు.

జిల్లాలో నిత్యం పశువులు అక్రమంగా తరలుతూ పట్టుబడుతున్నాయి. మరోవైపు అక్రమంగా నిర్వహిస్తున్న గోవధ శాలలు వెలుగుచూస్తున్నాయి. ఎస్‌.కోట మండలంలోని ఓ గ్రామంలో పెద్ద ఎత్తున గోమాంసం ఇటీవల బయటపడడం బాధాకరం. జిల్లాలో చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది. గుట్టుగా కబేళా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నాగావళి, చంపావతి, గోస్తనీ నదీ తీరాల్లో గోవధ సాగుతోందన్న ఆరోపణలున్నాయి. దీనిపై పక్కా నిఘా పెట్టడం లేదు. పట్టుకున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదు.

రాజాం, మార్చి 9(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో గోవధ శాలలు అక్రమంగా నిర్వహిస్తున్నారు. పందులు, మేకలు, గొర్రెల పేరుతో పశువులపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ మట్టుబెడుతున్నారు. వాటి మాంసంతో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి పోలీసులు దాడిచేయడం, కేసులు నమోదుచేయడం, తిరిగి వ్యాపారం కొనసాగించడం పరిపాటిగా మారింది. జిల్లాలో పశువధ శాలలకు ఎటువంటి అనుమతులు లేవని చెబుతున్నారు. కచ్చితంగా గోవధ శాలల నిర్వహణకు అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా నల్లజాతి గోవులను వధించకూడదు. ఒకవేళ సాగుకు, పాడికి పనికిరాదని పశు వైద్యాధికారి ధ్రువపత్రం ఇచ్చిన తరువాత మాత్రమే వధించాలి. అది కూడా విశాఖకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. జిల్లాలో వధించేందుకు ఎటువంటి అనుమతులు లేవు. కానీ ఎక్కడికక్కడే యథేచ్ఛగా గోవులను వధించి మాంసాలను విక్రయిస్తున్నారు. మద్యం షాపుల వద్ద వెలిసే హోటళ్లలో వీటి విక్రయాలు అధికంగా జరుపుతున్నట్టు ఆరోపణలున్నాయి.

కఠిన చర్యలేవి?

గతంలో హిందూ ధర్మప్రచార సమితితో పాటు గోసంరక్షకులు ప్రత్యేకంగా దృష్టిపెట్టేవారు. గతంలో ఓసారి విజయనగరంలో గోవధ శాలలో చిత్రాలను డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారు. సోషల్‌ మీడియాలో పెట్టడంతో పెను వివాదం నడిచింది. ఆ తరుణంలో కొత్తపేట కుమ్మరి వీధి సమీపంలో నిర్వహిస్తున్న గోవధ శాలను గోసంరక్షకులు పట్టించారు. స్ర్టింగ్‌ ఆపరేషన్‌ చేసి మరీ 4 వేల టన్నుల మాంసాన్ని, పదుల సంఖ్యలో పశువులను పోలీసులకు పట్టించారు. అదే సమయంలో యంత్రాంగం కఠిన చర్యలకు దిగితే కొంతవరకూ ఫలితముంటుంది. ఆహార కల్తీ నియంత్రణ అధికారులు హోటళ్లలో తనిఖీలు జరిపితే పశుమాంసం బట్టబయలు అయ్యే అవకాశం ఉంది.

యంత్రాంగం దృష్టిపెట్టాలి

జిల్లాలో అక్రమ గోవధ శాలలు కొనసాగుతున్నాయి. పోలీసులు నామమాత్రపు తనిఖీలకే పరిమితం అవుతున్నారు. అసలు అనుమతులే లేకపోతే గోవధ శాలలు ఎందుకు నిర్వహిస్తారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించాలి. లేకుంటే ప్రజాసంఘాలతో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. జిల్లా వ్యాప్తంగా పశు అక్రమ రవాణాపై దృష్టిపెట్టడంతో పాటు ఆహార కల్తీ నియంత్రణ అధికారులు సైతం రంగంలోకి దిగాలి.

- శ్రీనివాసనందస్వామి, సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు, రాజాం

----------------

Updated Date - Mar 09 , 2026 | 11:23 PM