Share News

నిరుద్యోగాన్ని పెంచిన నువ్వా డీఎస్సీపై మాట్లాడేది?

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:17 AM

‘నీ ప్రభు త్వంలో నిరుద్యోగం పెంచి.. యువతను మోసంచేసిన నువ్వా.. డీఎస్సీపై మా ట్లాడేది’ అంటూ ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరుద్యోగాన్ని పెంచిన నువ్వా డీఎస్సీపై  మాట్లాడేది?

  • మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై ఎమ్మెల్యే లలితకుమారి ఆగ్రహం

ఎస్‌.కోట రూరల్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ‘నీ ప్రభు త్వంలో నిరుద్యోగం పెంచి.. యువతను మోసంచేసిన నువ్వా.. డీఎస్సీపై మా ట్లాడేది’ అంటూ ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అలుగుబిల్లి గ్రామంలో ఎంపీటీసీ రాయవరపు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఆమె రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. గత ఎన్నికల్లో ఈ ప్రబుద్ధుడికి ప్రజలు 11 సీట్లుతో బుద్దిచెప్పినా మారలేదని ఈ సారి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెడతారంటూ ఎద్దేవా చేశారు. డీఎస్సీ నిర్వహణ ఎంతో పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సుదారాజు, టీడీపీ మండల అధ్యక్షుడు డోకుల చినఅచ్చెంనాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, కృష్ణమహంతిపురం చైర్మన్‌ మేడపురెడ్డి శ్రీనివాసరావు, ఖాసాపేట మాజీ సర్పంచ్‌ భూపాల్‌, తహసీల్దార్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:17 AM