Share News

Are you in a state of sleep? నిద్రావస్థలో ఉన్నారా?

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:04 AM

Are you in a state of sleep? ‘ఉద్యోగులు నిద్రావస్థలో ఉన్నారా? ప్రభుత్వం జీతాలు ఇస్తోంది కదా? పని చేయకపోతే ఎలా? కిందవారిపై నెట్టేసే ధోరణి సరికాదు. వెంటనే ఇచ్చిన లక్ష్యాలు చేరుకోవాలి’ అంటూ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యంలో 33 శాతంలోపే పనులు చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో వీబీజీరాంజీ పనులపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో సమీక్ష నిర్వహించారు.

Are you in a state of sleep? నిద్రావస్థలో ఉన్నారా?
మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

నిద్రావస్థలో ఉన్నారా?

జీతం తీసుకోవడం లేదా?

కింద వారిపై నెట్టేస్తే ఎలా?

వీబీజీరాంజీ పనుల తీరుపై ఆగ్రహించిన కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 21(ఆంఽద్రజ్యోతి):

‘ఉద్యోగులు నిద్రావస్థలో ఉన్నారా? ప్రభుత్వం జీతాలు ఇస్తోంది కదా? పని చేయకపోతే ఎలా? కిందవారిపై నెట్టేసే ధోరణి సరికాదు. వెంటనే ఇచ్చిన లక్ష్యాలు చేరుకోవాలి’ అంటూ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యంలో 33 శాతంలోపే పనులు చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో వీబీజీరాంజీ పనులపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పనులపై ఆరా తీశారు. రేగిడి, వంగర, సంతకవిటి, రాజాం మండలాల్లో పనుల నిర్వహణలో సరైన పురోగతి లేకపోవడంతో ఆయా మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఏపీవోలపై చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ శారదాదేవి ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధిహామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద జిల్లాకు విడుదలైన నిఽధుల్లో ప్రతిపైసా ఖర్చు చేయాలని ఆదేశించారు. నిధులను మార్చిలోగా పూర్తిగా వినియోగించాలని, మురిగిపోతే సహించేది లేదని హెచ్చరించారు. నెలాఖరుకు మంజూరైన పనులన్నీ గ్రౌండింగ్‌ చేయాలన్నారు. చక్కని ప్రగతి కనబర్చిన జామి, కొత్తవలస, గరివిడి, గుర్ల, మెరకముడిదాం ఎంపీడీవోలు, ఏపీవోలను అభినందించారు.

- సీసీ రోడ్లు, బీటీ రోడ్లపై సమీక్షిస్తూ నెలాఖరుకు అన్నింటినీ గ్రౌండింగ్‌ చేయాలని ఆదేశించారు. సుమారు రూ.116 కోట్లతో 2,107 సీసీ రోడ్ల పనులను మంజూరు చేయగా, ఇప్పటి వరకూ 731 పనులను మాత్రమే గ్రౌండింగ్‌ చేయడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలాఖరులోగా పనులను ప్రారంభించకపోతే రద్దు చేస్తామని, అందుకు ఆయా మండల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

- ఈ ఏడాది డిసెంబరు నాటికి 65 లక్షల పనిదినాల కల్పన లక్ష్యంకాగా అక్టోబరు వరకూ 32.37 లక్షల పనిదినాలు కల్పించామన్నారు. ఈ పనుల్లో జోరు పెంచడం ద్వారా ఈ ఏడాది పనిదినాల కల్పనలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలని దిశానిర్దేశం చేశారు. సగటు వేతనం ప్రస్తుతం రూ239 ఉందని, దీనిని గత ఏడాదిలాగే కనీసం రూ.265పైగా సాధించాలని ఆదేశించారు.

Updated Date - Nov 22 , 2026 | 12:04 AM