Share News

are you good బాగున్నాయా?

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:46 PM

are you good జిల్లాలో ఒకవైపు జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ రక్షిత మంచి నీరు అందించాలన్న ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు దశాబ్దాల కిందట నిర్మించిన ట్యాంకుల పరిస్థితిని మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

are you good బాగున్నాయా?
శిథిలావస్థకు చేరిన కొఠారిపురం వాటర్‌ ట్యాంక్‌

బాగున్నాయా?

శిథిలావస్థలో తాగునీటి ట్యాంకులు

ఎప్పటికప్పుడు శుభ్రం చేయని వైనం

పర్యవేక్షించని అధికారులు

రాజాం, మార్చి 4(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఒకవైపు జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ రక్షిత మంచి నీరు అందించాలన్న ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు దశాబ్దాల కిందట నిర్మించిన ట్యాంకుల పరిస్థితిని మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అదే సమయంలో ఆ ట్యాంకులను శుభ్రం చేయడం లేదు. ఆ నీరు తాగుతున్న లక్షల మంది ఆరోగ్యానికి భద్రత ఉందా అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.

జిల్లా వ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో 41 సమగ్ర మంచినీటి పథకాలు ఉన్నాయి. తాగునీరు అందుతున్న గ్రామాలు 1500 కాగా 17 లక్షల మంది జనాభా వీటి ద్వారా దాహం తీర్చుకుంటున్నారు. ఒక్కో ట్యాంకు లక్షమంది వరకూ తాగునీరు అందిస్తోంది. అయితే అందులో సగం ట్యాంకులు మెట్లు, నిచ్చెనలు పాడయ్యాయి. లీకులకు గురవుతున్నాయి. ట్యాంకులపై మొక్కలు మొలచి, పక్షుల మలమూత్ర విసర్జన చేస్తున్నాయి. కనీసం శుభ్రం చేసిన దాఖలాలు లేవు. దీంతో తాగునీరు గరళంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లిక ముందే అధికారులు స్పందించాలి. తాగునీటి ట్యాంకుల నిర్వహణ విషయానికి వచ్చేసరికి ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీల మధ్య వాదనలు జరుగుతున్నాయి. ట్యాంకుల నిర్వహణ మీదంటే మీదేనంటూ ఒకరిపై ఒకరు నెపం వేస్తున్నారు. ఈ ట్యాంకులను విధిగా రెండు నెలలకు ఒకసారి శుభ్రం చేయాలి. అయితే ఎక్కడా శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవు. ఆర్‌డబ్ల్యూఎస్‌ కనీస పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని ట్యాంకులపై పిచ్చి మొక్కలు కూడా దర్శనమిస్తున్నాయి. నిర్వహణలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

సత్వర చర్యలు

రక్షిత నీటి పథకాలకు సంబంధించి క్లోరినేషన్‌ బాధ్యత స్థానిక సంస్థలదే. ఆర్‌డబ్ల్యూఎస్‌ పరిధిలో పైపులైన్లు, మోటార్లు, ట్యాంకర్లకు మరమ్మతులు చేస్తాం. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం. సత్వర పరిష్కార మార్గం చూపిస్తాం.

- కవిత, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, విజయనగరం

Updated Date - Mar 04 , 2026 | 11:46 PM