Share News

Are those shops allowed? ఆ దుకాణాలకు అనుమతి ఉందా?

ABN , Publish Date - May 23 , 2026 | 11:40 PM

Are those shops allowed? ‘దుకాణం ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? మరెందుకు ఆలోచన.. మీ ఇష్టం ఎక్కడో ఒక చోట పెట్టేసుకోండి.. సార్లతో మాకు పరిచయాలు ఉన్నాయి. మేము ఏదో ఒకటి చెప్తాం.. మా సంగతి కాస్త చూడండి’ అంటూ కిందిస్థాయి సిబ్బంది భరోసా ఇవ్వడం.. ఆపై చకచకా షాపులు ఏర్పాటు కావడం ఇటీవల కాలంలో విజయనగరంలో చురుగ్గా జరుగుతోంది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో మామూళ్ల మత్తులో సిబ్బంది మునిగితేలుతున్నారు.

Are those shops allowed? ఆ దుకాణాలకు   అనుమతి ఉందా?

ఆ దుకాణాలకు

అనుమతి ఉందా?

నగరంలో పుట్టగొడుగుల్లా షాపులు

ట్రేడ్‌లైసెన్స్‌లు ఉన్నవి 3,500

లేనివి రెండువేలకు పైనే

మామూళ్ల మత్తులో సిబ్బంది

పట్టించుకోని ఉన్నతాధికారులు

‘దుకాణం ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? మరెందుకు ఆలోచన.. మీ ఇష్టం ఎక్కడో ఒక చోట పెట్టేసుకోండి.. సార్లతో మాకు పరిచయాలు ఉన్నాయి. మేము ఏదో ఒకటి చెప్తాం.. మా సంగతి కాస్త చూడండి’ అంటూ కిందిస్థాయి సిబ్బంది భరోసా ఇవ్వడం.. ఆపై చకచకా షాపులు ఏర్పాటు కావడం ఇటీవల కాలంలో విజయనగరంలో చురుగ్గా జరుగుతోంది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో మామూళ్ల మత్తులో సిబ్బంది మునిగితేలుతున్నారు.

విజయనగరం టౌన్‌, మే23(ఆంద్రజ్యోతి):

విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో ఇటీవల కాలంలో దుకాణాలు అధికంగా పెరిగాయి. కొంచెం స్థలం ఉన్నా కూడా షాపు ఏర్పాటు చేసేస్తున్నారు. లోతుగా ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. వీటికి అనుమతులు తీసుకోవడం లేదని తేలింది. పారిశుధ్య సిబ్బంది ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తాము ఉన్నామని ఉన్నతాధికారులు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా యజమానుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారు. సాధారణంగా షాపులు ఏర్పాటు చేయాలంటే కార్పొరేషన్‌ ప్రజారోగ్యశాఖ, రెవెన్యూశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. కార్పొరేషన్‌ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,600 షాపుల నుంచి లైసెన్స్‌ రుసుం రూ.46లక్షలు వసూలు చేసినట్లు ప్రజారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ అనధికారికంగా కనీసం రెండువేల దుకాణాలు నడుస్తున్నాయని సమాచారం. మిగిలిన షాపులపై దృష్టిసారించక పోవడంతో ఒకరిని చూసి మరొకరు కిందిస్థాయి సిబ్బందిని మేనేజ్‌ చేస్తూ దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

నగరంలో వాటర్‌సర్వీసింగ్‌, కిరాణా, భోజన హోటళ్లు, పండ్ల దుకాణాలు, మెడికల్‌షాపులు, పూల దుకాణాలు, సెలూన్‌ షాపులు, బేకరీలు, మెకానిక్‌ షాపులు, సెల్‌దుకాణాలు, జెరాక్స్‌ సెంటర్లు, ఎలక్ట్రీకల్‌ అండ్‌ హార్డ్‌వేర్‌ దుకాణాలు, సిమెంటు షాపులు ఇలా ఒకటేమిటి ప్రతీరోజు పుట్టగొడుగుల్లా కొత్తకొత్త షాపులు ఏర్పాటవుతున్నాయి. వీటికి ఎటువంటి అనుమతులు ఉండడం లేదు. కిందస్థాయి సిబ్బంది చేతివాటంతో ఇష్టారీతిలో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని సంబంధిత ప్రజారోగ్యశాఖాధికారి కొండపల్లి సాంబమూర్తి వద్ద ప్రస్తావించగా ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోకుండా పుట్టగొడుగుల్లా నూతన షాపులు ఏర్పాటు చేయడం గమనించామని, త్వరలోనే ప్రత్యేక డ్రైవ్‌ చేపడ్తామని చెప్పారు.

Updated Date - May 23 , 2026 | 11:40 PM