Share News

బ్యాలెట్‌ బాక్సులు పని చేస్తున్నాయా?

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:13 PM

: ‘మీ మండలాల పరిధిలో బ్యాలెట్‌ బాక్సులు ఎన్ని ఉన్నాయి. ఇందులో ఎన్ని బాగున్నాయి..

బ్యాలెట్‌ బాక్సులు పని చేస్తున్నాయా?
బ్యాలెట్‌ బాక్సులను పరిశీలిస్తున్న ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది

- నివేదికలు అందించండి

- ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు

- గరుగుబిల్లిలో బ్యాలెట్‌ బాక్సులను పరిశీలించిన సిబ్బంది

గరుగుబిల్లి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘మీ మండలాల పరిధిలో బ్యాలెట్‌ బాక్సులు ఎన్ని ఉన్నాయి. ఇందులో ఎన్ని బాగున్నాయి.. ఏమై నా మరమ్మతులకు గురయ్యాయా?. వెంటనే నివేదికలు అందించండి.’ అని రాష్ట్ర పంచాయ తీరాజ్‌ కమిషనర్‌ మైలవరపు కృష్ణతేజతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు ఆ పనిలో నిమగ్నయ్యారు. జిల్లా పంచాయతీ అధికారి శిష్ట రవీంద్ర ఆదే శాలతో శనివారం గరుగుబిల్లి మండల పరిషత్‌ కార్యాలయంలోని బ్యాలెట్‌ బాక్సులను సిబ్బంది పరిశీలించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిం చే సమయానికి పూర్తిస్థాయిలో వాటిని విని యోగంలోకి తెచ్చే విధంగా దృష్టి సారిస్తున్నా రు. పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 2తో ముగిసింది. వీరి స్థానంలో మండల అధికారులను ప్రత్యేకాధికారులుగా ప్ర భుత్వం నియమించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత జిల్లా అధికారులతో ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. పార్వతీపురం డివిజన్‌ పరిధిలోని ఎనిమిది మండలాలకు సంబంధించి 224 పంచాయ తీలు, 2,102 వార్డులు ఉన్నాయి. అలాగే పాల కొండ డివిజన్‌కు సంబంధించి 7 మండలాల పరిధిలో 227 పంచాయతీలు, 2,026 వార్డులు ఉన్నాయి. మొత్తం 15 మండలాల పరిధిలో 451 పంచాయతీలు, 4,128 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 451 పంచాయతీల పరిధిలో 3,14,887 మంది పురుషులు, 3,33,373 మంది స్త్రీలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే అవసరమైన చర్యల చేపట్టేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

Updated Date - Jun 06 , 2026 | 11:13 PM