డాక్టర్లు వస్తున్నారా.. మందులు ఇస్తున్నారా?
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:36 AM
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి గురు వారం జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ‘డాక్టర్లు సకాలంలో వస్తు న్నారా?.. మందులు ఉచితంగా ఇస్తు న్నారా’ అని రోగులను ఆరా తీశారు.
జిల్లా ఆసుపత్రిలో రోగులను ఆరా తీసిన కలెక్టర్
మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశాలు
బెలగాం, జూలై 23(ఆంధ్రజ్యోతి): కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి గురు వారం జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ‘డాక్టర్లు సకాలంలో వస్తు న్నారా?.. మందులు ఉచితంగా ఇస్తు న్నారా’ అని రోగులను ఆరా తీశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను, రోగులకు అందిస్తున్న సేవలు, ఆహా రం తదితర ఏర్పాట్లును ఆయన పరిశీలించారు. అనంతరం వార్డు ల్లోని చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి విచారించారు. ప్రత్యే కంగా ప్రసూతి వార్డులో బాలింత లకు అందుతున్న సేవలను పరిశీ లించారు. కాన్పుల వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు. వార్డులు, టాయిలెట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, ఆసుపత్రి పరిసరాలు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉం డాలని ఆర్‌ఎంవో, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వంటగది, స్టోర్‌రూమ్‌ను తనిఖీ చేసి భోజనం నాణ్యతను, వండేపదార్థాలను పరిశీలించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగశివజ్యోతి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ జి.నాగభషణరావు, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోట్పా చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి
పార్వతీపురం టౌన్, జూలై 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కోట్పా (సిగిరెట్ అండ్ అదర్ టబాకో ప్రొడెక్ట్ యాక్ట్-2003) చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎన్.ప్రభా కర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ (ఎన్.కోర్డ్) సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులు, బ్లాక్ స్పాట్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద నిఘాను మరింత తీవ్రతరం చేయలన్నారు. నార్కోటిక్స్ నివారణతో పాటు జిల్లాలో కోట్పా చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. ము ఖ్యంగా పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రాంగణంల్లో పొగాకు, మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. టీ దుకాణాలు, పాన్ షాప్‌ల వద్ద నిబంధనలకు విరు ద్ధంగా నిషేధిత వస్తువులు విక్రయిస్తే జరిమానాలు విధించి, కఠిన చర్య లు చేపట్టాలన్నారు. ప్రధానంగా యువ తను లక్ష్యంగా చేసుకుని విద్యాసం స్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించ డంతో పాటు ఆపరేషన్ గరుడ చేపట్టాలని, డ్రోన్ కెమె రాల సాయంతో నిఘా కట్టుది ట్టం చేయాలని అన్నారు. పోలీసు, ఆర్‌అండ్‌బీ అధికారులు బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి రేడియం బోర్డులు, బ్లింకర్ లైట్లు అమర్చాలన్నారు.
తల్లుల ఖాతాల్లోకి రూ.173.25 కోట్లు జమ
పార్వతీపురం టౌన్, జూలై 23(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం కింద పథకం రూ.173.25 కోట్లు జిల్లాలోని అర్హులైన 81,598 మంది తల్లుల ఖాతాల్లో జమ అయినట్లు కలెక్టర్ ఎన్.ప్రభాక ర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం కింద జిల్లాలో 1,15,501 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందన్నారు. శుక్రవారం నాటికి శతశాతం నిధులు జమ అవుతాయన్నారు. గతంలో ఇంట్లో ఒక్కరికి మాత్రమే తల్లికి వందనం ఆర్థిక సాయం అందేదని, కూటమి ప్రభుత్వ హయాంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తోందని అన్నారు.