Share News

APRJC exam peaceful ఏపీఆర్‌జేసీ పరీక్ష ప్రశాంతం

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:39 AM

APRJC exam peaceful ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీ, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం ఐదో తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహించగా, మధ్యాహ్నం జూనియర్‌, డిగ్రీ కాలేజీల ప్రవేశానికి నిర్వహించారు

APRJC exam peaceful ఏపీఆర్‌జేసీ పరీక్ష ప్రశాంతం
ఏపీఆర్‌జేసి పరీక్షకు హాజరైన విద్యార్ధులు

ఏపీఆర్‌జేసీ పరీక్ష ప్రశాంతం

విజయనగరం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి) ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీ, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం ఐదో తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహించగా, మధ్యాహ్నం జూనియర్‌, డిగ్రీ కాలేజీల ప్రవేశానికి నిర్వహించారు. బొబ్బిలి, తాటిపూడి రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రవేశానికి 996 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 843 మంది రాశారు. 84.65 శాతం హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన ఏపిఆర్‌జేసీ పరీక్ష 10 కేంద్రాల్లో నిర్వహించారు. 2302 మంది హాజరు కావాల్సి ఉండగా 2116 మంది రాశారు. 91.12 శాతం హాజరయ్యారు.

Updated Date - Apr 25 , 2026 | 12:39 AM