APPSC exams from tomorrow రేపటి నుంచి ఏపీపీఎస్‌సీ పరీక్షలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:55 PM
APPSC exams from tomorrow ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో దేవదాయ, అటవీశాఖలకు సంబంధించిన పోస్టులకు ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకూ జరగనున్న పరీక్షలు పక్కాగా నిర్వహించాలని ఇన్‌చార్జి డీఆర్‌వో నూకరాజు ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులలో సమావేశం నిర్వహించారు.
రేపటి నుంచి ఏపీపీఎస్‌సీ పరీక్షలు
హాజరు కానున్న 6700 మంది అభ్యర్థులు
రెండు కేంద్రాల్లో నిర్వహణ: డీఆర్‌వో
విజయనగరం కలెక్టరేట్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో దేవదాయ, అటవీశాఖలకు సంబంధించిన పోస్టులకు ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకూ జరగనున్న పరీక్షలు పక్కాగా నిర్వహించాలని ఇన్‌చార్జి డీఆర్‌వో నూకరాజు ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రెండు కేంద్రాల్లో ఈపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీతం, జెఎన్‌టీయులో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పరీక్షలకు 6700 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. అటవీశాఖకు సంబంధించి ఫారెస్టు సెక్షన్ ఆఫీసరు, ఫారెస్టు బీటు ఆఫీసర్, ధానేధార్‌తో పాటు దేవదాయ శాఖకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ -3 పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా తాగునీరు, వైద్య, లైటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తోపాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. సెల్‌ఫోన్లు, ఎలాంటి ఎలక్ర్టానిక్ పరికరాలు కేంద్రాల్లోకి అనుమతించబోమని చెప్పారు.