Share News

దంత వైద్యులకు ప్రశంసలు

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:19 AM

జిల్లా ఆసుపత్రి దంత వైద్యులు నాగశేఖర్‌, శ్యామలకు డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ నుంచి ప్రశంసలు అందుకున్నారని డీసీహెచ్‌వో డాక్టర్‌ జి.నాగభూషణరావు తెలిపారు.

దంత వైద్యులకు ప్రశంసలు
వైద్యులకు ప్రశంసాపత్రాలను అందజేస్తున్న డీసీహెచ్‌వో

పార్వతీపురం టౌన్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఆసుపత్రి దంత వైద్యులు నాగశేఖర్‌, శ్యామలకు డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ నుంచి ప్రశంసలు అందుకున్నారని డీసీహెచ్‌వో డాక్టర్‌ జి.నాగభూషణరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఇద్దరు డాక్టర్లు 877 దంత సంబంధిత సేవలు అత్యధికంగా అందించినందుకు డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ అభినందించడంతో పాటు ప్రశంసాపత్రాలను పంపించిందన్నారు. ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లకు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగశివజ్యోతితో పాటు వైద్యులు, సిబ్బంది, ఏపీఎన్జీవో నాయకులు జీవీఆర్‌ఎస్‌ కిశోర్‌ అభినందనలు తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 12:19 AM